Laxman Naik: సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా బాడీ పెయింటింగ్ వేయించుకున్న తెలంగాణ యువకుడు

Telangana youth paints his body with CM Jagan

  • నేడు సీఎం జగన్ పుట్టినరోజు
  • శరీరంపై జగన్ బొమ్మ పెయింట్ వేయించుకున్న లక్ష్మణ్ నాయక్
  • లక్ష్మణ్ నాయక్ స్వస్థలం తెలంగాణలోని దేవరకొండ
  • జగన్ తో సెల్ఫీ దిగాలని కోరిక
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో

ఏపీ సీఎం జగన్ పై అభిమానం రాష్ట్రాల సరిహద్దులు దాటింది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ తెలంగాణ యువకుడు బాడీ పెయింటింగ్ వేయించుకుని తన ఆరాధ్య రాజకీయనేతకు నీరాజనాలు సమర్పించాడు. తెలంగాణలోని దేవరకొండకు చెందిన లక్ష్మణ్ నాయక్ వైఎస్ జగన్ కు వీరాభిమాని. అందుకే ఇవాళ సీఎం జగన్ 48వ జన్మదినం సందర్భంగా తన శరీరంపై వైసీపీ రంగులతో పాటు, జగన్ బొమ్మను పెయింట్ వేయించుకున్నాడు.

ముందువైపు 'హ్యాపీ బర్త్ డే సీఎం సర్' అనే అక్షరాలు, వీపు పైన 'వైఎస్సార్' అనే అక్షరాలతో లక్ష్మణ్ నాయక్ తన ప్రేమను చాటాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, లక్ష్మణ్ నాయక్ తన ప్రియతమ రాజకీయనేతను కలిసి ఓ సెల్ఫీ దిగాలని కోరుకుంటున్నాడు.

Laxman Naik
Jagan
Birthday
Body Painting
YSRCP
Telangana
Andhra Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News