Chiranjeevi: బిగ్ బాస్ స్టేజ్ పైనే మెహబూబ్ కు రూ.10 లక్షలకు చెక్ రాసిచ్చిన చిరంజీవి

Chiranjeevi sign ten lakhs check for Mehboob
  • బిగ్ బాస్ రియాల్టీ షో ఫైనల్స్ కు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి
  • మెహబూబ్ పట్ల ఉదారంగా స్పందించిన మెగాస్టార్
  • మనసున్న స్టార్ ని అని నిరూపించుకున్న వైనం
  • చిరు చర్యకు కన్నీటి పర్యంతమైన మెహబూబ్
  • దివికి బంపర్ ఆఫర్ ఇచ్చిన చిరు
తెలుగు చలనచిత్ర రంగంలో తాను మెగాస్టార్ ను మాత్రమే కాదని, మనసున్న స్టార్ ని అని కూడా చిరంజీవి చాటుకున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి స్టేజ్ పై తన దాతృత్వాన్ని ప్రదర్శించారు.

తనకు సొహైల్ ఇవ్వజూపిన రూ.5 లక్షలను మెహబూబ్ అనాథలకు ఇవ్వాలనుకున్నాడని నాగ్ చెప్పడంతో చిరంజీవి స్పందించారు. ఈ షో ద్వారా సంపాదించిన సొమ్మును మీరు మీ కోసం ఉపయోగించుకోండి... మెహబూబ్ కు నేను ఇస్తున్నాను రూ.10 లక్షలు అంటూ అప్పటికప్పుడు చెక్ రాశారు.

ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమైన మెహబూబ్ చిరంజీవికి పాదాభివందనం చేశాడు. మెహబూబ్ ను చిరంజీవి తన గుండెలకు హత్తుకుని ఊరడించారు. ఇక మరో కంటెస్టెంట్ దివితో చిరు మాట్లాడుతూ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర ఇస్తున్నట్టు చెప్పారు. దాంతో దివి ఎగిరి గంతేసింది. బిగ్ బాస్ ఇంట్లో దివి పెర్ఫార్మెన్స్ చూశాక దర్శకుడు మెహర్ రమేశ్ ను అడిగి ఓ ప్రత్యేక పాత్రను రూపొందించామని చిరంజీవి వెల్లడించారు.
Chiranjeevi
Mehboob
Cash
Check

More Telugu News