Gangavva: బిగ్ బాస్ ఇచ్చిన డబ్బుతో బంగారం కొని మె(ము)రిసిపోతున్న గంగవ్వ... వీడియో ఇదిగో!

Gangavvy buys Gold with Biggboss Winning Money
  • ప్రస్తుత సీజన్ లో పోటీదారుగా ఉన్న గంగవ్వ
  • టాస్క్ లో భాగంగా గెలిచిన డబ్బుతో బంగారం కొనుగోలు
  • వీడియో పోస్ట్ చేయడంతో వైరల్
గంగవ్వ... ఈ పేరు తెలుగు టీవీ ప్రేక్షకులకు సుపరిచితమే. బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి ఓ సామాన్యురాలిగా ప్రవేశించి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని, ఆపై హౌస్ లో ఉండలేక కన్నీరు పెట్టుకుని, బిగ్ బాస్ నిర్వాహకులను వేడుకుని బయటకు వచ్చిన వృద్ధురాలు. ఈ సీజన్ లో మోస్ట్ ఎట్రాక్షన్ పర్సన్ గా కూడా ఆమె పేరు తెచ్చుకుంది. హౌస్ లో ఉన్నంతసేపూ, కల్మషం లేకుండా మిగతా కంటెస్టెంట్లకు సమాధానాలు, పంచ్ లు ఇస్తూ లక్షలాది మందిని అలరించింది.

తనకంటూ ఓ సొంత ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన డబ్బులు ఇస్తామంటేనే తాను హౌస్ లోకి వచ్చానని ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పిన ఆమెకు, ఇంటిని కట్టిస్తానని హోస్ట్ నాగార్జున కూడా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆపై అనారోగ్య కారణాలతో ఆమె బయటకు రాగా, ఇంటి నిర్మాణం కూడా ప్రారంభమైంది.

ఇక బిగ్ బాస్ షోలో భాగంగా జరిగిన స్పెషల్ టాస్క్ లో లక్ష రూపాయలు గెలుచుకున్న ఆమె, ఆ డబ్బుతో బంగారాన్ని కొనుగోలు చేసింది. తాజాగా హైదరాబాద్ లోని ఓ జ్యూయెలరీ షాపుకు వచ్చిన గంగవ్వ, రెండుతులాల బంగారాన్ని కొనుక్కుంది. ఇక ఆ షాపులో కొన్ని ఆభరణాలు ధరించి, ఆ వీడియోను తన చానెల్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షాపులో అక్కడి ఆభరణాలను ధరించి మురిసిపోతున్న గంగవ్వ వీడియోను మీరూ చూడవచ్చు.

Gangavva
Bigg Boss Telugu 4
Gold
Task
Winning Money

More Telugu News