India: 244 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా

India All out for 244 Runs

  • నిన్న 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు
  • నేడు 11 పరుగులు జోడించి 4 వికెట్లు కోల్పోయిన ఇండియా
  • స్టార్క్ కు 4 వికెట్లు

ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా 244 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాగా, తొలి రోజున 6 వికెట్ల నష్టానికి 233 పరుగుల వద్ద ఆగిన ఇన్నింగ్స్, ఈ ఉదయం కొద్దిసేపటిలోనే ముగిసింది. కేవలం 11 పరుగులను మాత్రమే జోడించిన టెయిలెండర్లు ఇండియా ఇన్నింగ్స్ ను ముగించారు.

భారత ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే 74 పరుగులు చేసి రాణించాడు. ఓపెనర్ పృథ్వీ షా డక్కౌట్ కాగా, మయాంక్ అగర్వాల్ 17, పుజారా 43, రహానే 42, హనుమ విహారి 16, సాహా 9, అశ్విన్ 15, ఉమేష్ యాదవ్ 6, మహమ్మద్ షమీ 0 పరుగులకు అవుట్ కాగా, బుమ్రా 4 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ కు 4, పాట్ కమిన్స్ కు 3 వికెట్లు దక్కగా, జోహ్ హాజెల్ వుడ్, నాథన్ లియాన్ లకు చెరో వికెట్ లభించాయి. మరికాసేపట్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.

India
Australia
Runs
All out
Test Cricket
  • Loading...

More Telugu News