Prithvi Shah: రెండో బాల్ కే డక్కౌట్ గా వెనుతిరిగిన పృథ్వీ షా!

Opener Pridhvi Shah Duck out in First Test

  • కెరీర్ లో తొలిసారిగా పృథ్వీ డక్కౌట్
  • ఒక్క పరుగు చేయకుండానే తొలి వికెట్ కోల్పోయిన భారత్
  • భారత్ ను దెబ్బకొట్టిన స్టార్క్

ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ను వేసిన మిచెల్ స్టార్క్, తన రెండో బంతికే ఓపెనర్ పృథ్వీ షాను అవుట్ చేశాడు. పరుగులేమీ చేయకుండానే పృథ్వీ షా పెవిలియన్ చేరడంతో, పరుగుల ఖాతాను తెరవకుండానే, ఇండియా తొలి వికెట్ ను కోల్పోయింది. పృథ్వీ షా తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో తొలిసారి డక్కౌట్ కావడం గమనార్హం. దీంతో మరో ఓపెనర్ ఛటేశ్వర్ పుజారాకు జతగా మయాంక్ అగర్వాల్ వచ్చి చేరాడు.

Prithvi Shah
Pink Ball Test
Duck Out
India
Australia
  • Loading...

More Telugu News