America: రేపు బహిరంగంగా కరోనా టీకా వేయించుకోనున్న మైక్ పెన్స్ దంపతులు
- చురుగ్గా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం
- వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే ఉద్దేశం
- టీకా భద్రత, సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకేనన్న వైట్‌హౌస్
కరోనా టీకాపై ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు రేపు (శుక్రవారం) బహిరంగంగా వ్యాక్సినేషన్ తీసుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్ పెన్స్‌లు రేపు బహిరంగంగా టీకా వేయించుకుంటారని శ్వేతసౌధం ప్రకటించింది. టీకా భద్రత, సామర్థ్యాన్ని ప్రోత్సహించడంతోపాటు, ప్రజల్లో విశ్వాసాన్ని ప్రోదిచేసేందుకే వారు బహిరంగంగా టీకా స్వీకరించనున్నట్టు వివరించింది.
కాగా, ఇటీవల ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు రాగా, సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఫైజర్ తొలి టీకాను క్వీన్స్ లోని లాంగ్ ఐలండ్ యూదు మెడికల్ సెంటర్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్‌లో పనిచేస్తున్న నర్సు శాండ్రా లిండ్రేకు తొలి టీకా వేశారు.