KTR: వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం.. వాటి విలువ రూ.50 లక్షల చొప్పున ఉంటుందన్న కేటీఆర్

ktr opens double bed room houses

  • 324 డబుల్‌ బెడ్రూం ఇళ్ల ప్రారంభం
  • రూ.28 కోట్ల వ్యయంతో నిర్మాణం
  • 2 ఎక‌రాల విస్తీర్ణంలో 3 బ్లాక్‌లుగా 9 అంత‌స్తుల్లో నిర్మాణాలు 

హైదరాబాద్‌ లోని వనస్థలిపురం జైభ‌వాని న‌గ‌ర్‌లో నిర్మించిన 324 డబుల్‌ బెడ్రూం ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ రిబ్బన్ కట్ చేసి వాటిని ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్ల తాళం చెవులు అందజేశారు. ఈ కార్యక్ర‌మంలో కేటీఆర్‌తో పాటు మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మ‌ల్లేశం కూడా పాల్గొన్నారు. ఈ ఇళ్లను  రూ.28 కోట్ల వ్యయం 2 ఎక‌రాల విస్తీర్ణంలో 3 బ్లాక్‌లుగా 9 అంత‌స్తుల్లో నిర్మించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...  దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి భవనాలు పేదలకు నిర్మించి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా రెండు బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. సాధారణంగా వనస్థలిపురంలో ఇదే ఇల్లు కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.50 లక్షల ఖర్చవుతుందని తెలిపారు. పేదలకు తమ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News