IT Raids: రూ. 700 కోట్ల పన్ను ఎగవేసిన చెట్టినాడు గ్రూప్

IT Dept detects over Rs 700 crore tax evasion Chettinad Group

  • చెట్టినాడు గ్రూప్ సంస్థల్లో సోదాలు
  • రూ. 110 కోట్ల విదేశీ ఆస్తుల గుర్తింపు
  • వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న సంస్థ

చెట్టినాడు గ్రూప్ సంస్థలకు చెందిన చెన్నై, కోయంబత్తూర్, తిరుచ్చి, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కార్యాలయాల్లో ఇటీవల ఆదాయపన్నుశాఖ జరిపిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. 110 కోట్ల రూపాయల విదేశీ ఆస్తులు వెలుగుచూశాయి. అలాగే, సోదాల్లో లభించిన కీలక పత్రాల ఆధారంగా రూ. 700 కోట్ల మేర పన్ను ఎగవేసిన విషయం వెలుగుచూసింది. తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న చెట్టినాడు గ్రూప్ సిమెంటు, విద్య, వైద్యం, ఉక్కు ఉత్పత్తి, విద్యుదుత్పత్తి, రవాణా తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News