Kajal Aggarwal: మళ్లీ నా ఇంటికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది: కాజల్
- భర్తతో కలిసి ఆచార్య సెట్స్ కు వచ్చిన కాజల్
- ఆత్మీయ స్వాగతం పలికిన చిత్రబృందం
- ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యానన్న కాజల్
- చిరంజీవికి, కొరటాల శివకు కృతజ్ఞతలు
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఇవాళ తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఆచార్య సెట్స్ పై అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ సహా ఆచార్య యూనిట్ సభ్యులంతా సాదరంగా స్వాగతం పలికారు. తనకు, తన భర్తకు లభించిన స్వాగతం పట్ల కాజల్ అగర్వాల్ ముగ్ధురాలైంది. మళ్లీ తన ఇంటికి వచ్చిన ఉద్విగ్నభరిత ఫీలింగ్ కలుగుతోందని ట్వీట్ చేసింది. ఎంతో తీయని స్వాగతం పలికారని పేర్కొంది. చిరంజీవికి, కొరటాల శివకు, యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసింది.