: విశాఖ సీటు కోసం 'అమ్మ'ను కలిసిన టి.సుబ్బరామిరెడ్డి


రాజకీయనాయకుడు, పారిశ్రామికవేత్త టి. సుబ్బరామిరెడ్డి విశాఖపట్నం లోక్ సభ సీటు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని నేడు ఢిల్లీలో కలిశారు. విశాఖలో తప్ప మరెక్కడా తాను పోటీచేయబోనని, అక్కడైతే తప్పక గెలుస్తానని ఆమెకు చెప్పారు. తన హయాంలో విశాఖలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. రాజ్యసభ సీటు వద్దంటూ, లోక్ సభ సీటే కావాలని అధినేత్రికి తెగేసి చెప్పారు. సిట్టింగ్ ఎంపీ పురందేశ్వరికి నరసరావుపేట స్థానం కేటాయించాలని సూచించారు. సోనియమ్మతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.

  • Loading...

More Telugu News