Udaipur: తిరుమలలో నిహారిక దంపతులు... చూసేందుకు భక్తుల ఆసక్తి!

Niharika andh Chaitanya Visit Tirumala today
  • గత వారం ఉదయ్ పూర్ లో నిహారిక వివాహం
  • స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న దంపతులు
  • తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు
గత వారం ఉదయ్ పూర్ లో వివాహం చేసుకున్న మెగా డాటర్ నిహారిక, తన భర్త చైతన్యతో కలిసి ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయానికి వచ్చిన కొత్త దంపతులు, స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై వీరికి అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల వీరిని చూసేందుకు అక్కడి జనం ఆసక్తి చూపారు. ఈ నెల 9న వీరిద్దరి వివాహం జరుగగా, ఆపై 11న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Udaipur
Niharika
Chaitanya
Tirumala

More Telugu News