Pawan Kalyan: వెంకటేశ్ తో నా స్నేహం ఎంతో ప్రత్యేకమైనది: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Venkatesh on his birthdady
  • నేడు వెంకటేశ్ పుట్టినరోజు
  • శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • హీరో అవకముందే వెంకీతో పరిచయం ఉందని వెల్లడి
  • ఆయన పుస్తకాలు బాగా చదువుతారని వివరణ
  • ఆ స్నేహమే గోపాల గోపాల చిత్రంలో నటించేలా చేసిందన్న పవన్
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రత్యేక ప్రకటన చేశారు. మంచి మనసున్న సన్మిత్రుడు వెంకటేశ్ అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో వెంకటేశ్ తో తన స్నేహం చాలా ప్రత్యేకమైనదని వెల్లడించారు. తాను హీరో కాకముందు నుంచి వెంకటేశ్ తో పరిచయం ఉందని, తరచుగా వెంకటేశ్ తో మాట్లాడుతుండేవాడ్నని వివరించారు.

"ఆయన పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధ పుస్తకాలు చదివేవారు. ఆ పుస్తకాల్లోని సంగతులు వివరించేవారు. ఆ సంభాషణలు, చర్చలు మా స్నేహాన్ని మరింత బలోపేతం చేశాయి. ఇప్పటికీ మా మధ్య సినిమా సంగతులతో పాటు హైందవ ధర్మం, భక్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి.

ఆ స్నేహమే గోపాల గోపాల చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ సినిమా అద్దంపట్టింది" అని పవన్ వివరించారు. కొత్తతరం దర్శకుల కథలకు, ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకునే వెంకటేశ్ మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Pawan Kalyan
Venkatesh
Birthday
Friendship
Tollywood

More Telugu News