India: డిజిటల్ రూపంలోకి మారనున్న ఓటర్ కార్డు!

Very Soon Voter Card Changed into Digital

  • కార్డు లేకుండానే ఓటేసే అవకాశం
  • విదేశీయులకు కూడా డౌన్ లోడ్ చేసుకునే చాన్స్
  • చిప్ రూపంలో కార్డులోసమాచారం

ఓటర్ కార్డు కూడా సమీప భవిష్యత్తులో డిజిటల్ కార్డుగా మారబోతోంది. అంటే... ఓటేసేందుకు వెళ్లే సమయంలో తమ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ ఇండియాను ప్రమోట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, దశలవారీగా ఓటరు కార్డులను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఓటరు కార్డులను డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చడానికి సన్నాహాలు చేస్తోంది. అంతే కాదు... క్యూఆర్ కోడ్ ల ద్వారా ఓటరు సమాచారం మొత్తం చిప్ రూపంలో కార్డులో నిక్షిప్తమవుతుంది.

ఈ విషయాన్ని వెల్లడించిన ఓ ఎలక్షన్ కమిషన్ అధికారి, విదేశాల్లో ఉన్న వారు కూడా తమ కార్డును ఇకపై సెకన్లలోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

India
Voter Card
Digital
QR Code
  • Loading...

More Telugu News