Jr NTR: మళ్లీ బుల్లితెరకు.. రియాలిటీ షోకి హోస్టుగా ఎన్టీఆర్!

NTR to host a reality show

  • గతంలో 'బిగ్ బాస్' షోకి హోస్టుగా ఎన్టీఆర్
  • తాజాగా మరో రియాలిటీ షోకి గ్రీన్ సిగ్నల్
  • షూటింగ్ కోసం అన్నపూర్ణలో సెట్స్
  • త్వరలో ప్రారంభం కానున్న షూటింగ్    

మన స్టార్ హీరోలు ఓపక్క సినిమాలలో నటిస్తూనే.. మరోపక్క అప్పుడప్పుడు బుల్లితెరపై రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రత్యక్షమవుతుండడాన్ని మనం ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా రియాలిటీ షోస్ పేరిట ప్రసారమయ్యే కార్యక్రమాలకి హోస్టుగా వ్యవహరిస్తూ వుంటారు. ఇది పారితోషికం పరంగా కూడా ఆకర్షణీయంగా ఉండడంతో స్టార్ హీరోలు వాటిపట్ల ఆసక్తి చూపుతున్నారు.

ఈ కోవలో గతంలో ఎన్టీఆర్ కూడా 'బిగ్ బాస్' షోకి హోస్టుగా వ్యవహరించాడు. తనదైన శైలిలో ఆ షోని రక్తికట్టించాడు. ఈ క్రమంలో మరోసారి ఈ యంగ్ టైగర్ బుల్లితెరపై కనిపించి, అభిమానులను అలరించనున్నట్టు తెలుస్తోంది.

ఓ టీవీ ఛానెల్ నిర్వహించే రియాలిటీ షోకి హోస్టుగా వ్యవహరించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సెట్స్ కూడా వేస్తున్నారట. త్వరలోనే ఆ సెట్స్ లో షోకి సంబంధించిన కొన్ని ఎపిసోడ్ల కోసం షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Jr NTR
Bigg Boss
Reality Show
  • Loading...

More Telugu News