KCR: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయిన కేసీఆర్

KCR meets Union Minister Hardeep Singh Puri

  • టీఆర్ఎస్ కు స్థలం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్
  • సిద్ధిపేట, వరంగల్ విమానాశ్రయాలకు సహకరించాలని విన్నపం
  • పలు విషయాలపై చర్చించిన సీఎం

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన పౌరవిమానయాన శాఖ, హౌసింగ్ మరియు పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు.

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించినందుకు కేంద్ర మంత్రికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని సిద్ధిపేట, వరంగల్ లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటు, పలు విషయాలపై ఆయనతో చర్చించారు.

KCR
TRS
Hardeep Singh Puri
BJP
  • Loading...

More Telugu News