Maharashtra: ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టీషర్టులు ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర సర్కారు ఆదేశాలు

Maharashtra Govt imposes dress code to Govt employees

  • ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధించిన మహా ప్రభుత్వం
  • ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలి  
  • నిబంధనలకు అతీతంగా వ్యవహరించవద్దని హెచ్చరిక

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వోద్యోగులకు డ్రెస్ కోడ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు జీన్స్, టీషర్టులు ధరించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. వస్త్రధారణ విషయంలో ప్రభుత్వోద్యోగులెవరూ నిబంధనలకు అతీతంగా వ్యవహరించకూడదని హెచ్చరించింది.

 ప్రొఫెషనల్ గా ఉండాలని, ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించింది. ఇప్పటికే ఈ తరహా ఉత్తర్వులను పలు రాష్ట్రాలు జారీ చేశాయి. జీన్స్, టీషర్ట్స్ ధరించకూడదని ఆదేశాలు జారీ చేశాయి. మహిళలు స్కర్టులు ధరించకుండా కూడా నిబంధనలు విధించాయి. బీహార్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటకలు ఇలాంటి ఉత్తర్వులను జారీ చేశాయి.

  • Loading...

More Telugu News