Vijayashanti: సీఎం కేసీఆర్ దొరగారికి తెలంగాణ అంటే ఈ రెండు ప్రాంతాలేనా?: విజయశాంతి

Vijayasanthi once again criticizes on CM KCR

  • సిద్ధిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్
  • ఆ రెండు ప్రాంతాలపై వరాల జల్లు కురిపించారన్న విజయశాంతి
  • తెలంగాణ అంటే ఆ రెండు ప్రాంతాలేనా అంటూ ఆగ్రహం
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడంలేదని ట్వీట్

సీఎం కేసీఆర్ ఇవాళ సిద్ధిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. గజ్వేల్, సిద్ధిపేటలపై వేల కోట్ల విలువైన వరాలు కురిపించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ దొరగారికి తెలంగాణ అంటే ఈ రెండు ప్రాంతాలు మాత్రమేనా అని ప్రశ్నించారు. మిగిలిన తెలంగాణ అంతా ఆయన దృష్టిలో ప్రాంతేతర పరగణానా? అంటూ ట్వీట్ చేశారు.

 ఇంత అన్యాయం ఏమిటని 100 మంది వరకు ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విజయశాంతి తీవ్ర విమర్శలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవలే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.

Vijayashanti
KCR
Siddipet
Gajwel
Telangana
  • Loading...

More Telugu News