Vijay: విజయ్ 'మాస్టర్' విడుదలకు డేట్ ఫిక్సయింది!

Date fixed for Vijays Master

  • లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 'మాస్టర్'
  • వాస్తవానికి మార్చిలో విడుదల కావలసిన చిత్రం
  • థియేటర్లు మూతపడడంతో రిలీజ్ వాయిదా
  • సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల
  • విలన్ గా విజయ్ సేతుపతి కీలక పాత్ర      

హీరోగా విజయ్ కి తమిళనాట వున్న క్రేజ్.. ఇమేజ్ మనకు తెలుసు. రజనీకాంత్ తర్వాత మరో సూపర్ స్టార్ గా విజయ్ రాణిస్తున్నాడు. మాస్ సినిమాల ద్వారా విశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న విజయ్ సినిమా వస్తోందంటే తమిళనాట వుండే సందడే వేరు. అలాంటి ఫాలోయింగ్ ను పొందిన విజయ్ నటించిన తాజా చిత్రం 'మాస్టర్'. కార్తీతో ఆమధ్య 'ఖైదీ' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవానికి మొన్న మార్చిలో విడుదల కావాలి.

అయితే, కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం వల్ల థియేటర్లు మూతపడడంతో ఈ చిత్రం విడుదల కూడా ఆగిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 1న ఈ 'మాస్టర్' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు డేట్ ఖరారు చేశారట. విజయ్ కు తెలుగులో కూడా అభిమానులు ఉండడంతో ఈ చిత్రాన్ని కూడా అదే రోజున తెలుగు రాష్ట్రాలలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ 'మాస్టర్' చిత్రానికి మరో విశేషం కూడా వుంది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించాడు. హీరో పాత్రకు దీటుగా చాలా పవర్ ఫుల్ గా ఆ పాత్ర వుంటుందట. విజయ్ సేతుపతికి తెలుగులో కూడా క్రేజ్ ఉండడంతో ఆ విధంగా కూడా ఈ చిత్రం తెలుగు వెర్షన్ హక్కుల కోసం మంచి పోటీ ఏర్పడింది. అన్నట్టు, ఇందులో విజయ్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది.

Vijay
Vijay Setupati
Malavika Mohanan
Lokesh Kanagaraj
  • Loading...

More Telugu News