Break Dance: 'బ్రేక్ డ్యాన్స్' కు ఒలింపిక్ క్రీడల్లో స్థానం... ఐఓసీ ప్రకటన

IOC announces Break Dance as an Olympic sport
  • ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బ్రేక్ డ్యాన్స్
  • 2024 పారిస్ ఒలింపిక్ క్రీడల ద్వారా అరంగేట్రం
  • యువతను ఆకట్టుకునేందుకు ఐఓసీ చర్యలు
  • 2021 ఒలింపిక్స్ లో మూడు కొత్త క్రీడాంశాలకు స్థానం
  • టోక్యో క్రీడల్లో ఎంట్రీ ఇవ్వనున్న స్కేట్ బోర్డింగ్, క్లైంబింగ్, సర్ఫింగ్
బ్రేక్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేగవంతమైన శరీర కదలికలతో చేసే నృత్యమే బ్రేక్ డ్యాన్స్. పాశ్చాత్యదేశాల్లో మొదలైన ఈ డ్యాన్సింగ్ స్టయిల్ ప్రపంచవ్యాప్తమైంది. తాజాగా బ్రేక్ డ్యాన్స్ కు ఒలింపిక్ క్రీడల్లో స్థానం కల్పించారు. ఒలింపిక్స్ పట్ల యువతలో మరింత క్రేజ్ తీసుకువచ్చే క్రమంలో బ్రేక్ డ్యాన్స్ ను ఒలింపిక్ క్రీడగా గుర్తిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. 2024లో పారిస్ లో జరిగే ఒలింపిక్ క్రీడల ద్వారా బ్రేక్ డ్యాన్స్ అరంగేట్రం చేయనుంది.

కాగా, టోక్యోలో వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ ద్వారా మూడు కొత్త క్రీడాంశాలను పరిచయం చేయనున్నారు. స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ క్రీడలు కూడా ఒలింపిక్ క్రీడల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
Break Dance
Olympics
Sport
Paris
IOC

More Telugu News