Narendra Modi: పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని ఎలా నిర్మించగలం?: ప్రధాని మోదీ

Modi says can not build new era with older laws
  • వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు
  • అభివృద్ధి కోసం కొత్త చట్టాలు అవసరమన్న మోదీ
  • శతాబ్దాల నాటి చట్టాలు గుదిబండల్లా మారాయని వ్యాఖ్యలు
  • సంస్కరణలు నిరంతర ప్రక్రియ అంటూ వివరణ
ఇటీవల కేంద్రం వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం మూడు కొత్త చట్టాలు తీసుకురాగా, ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు హస్తినలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అభివృద్ధి జరగాలంటే సంస్కరణల అవసరం ఎంతైనా ఉందని, కానీ శతాబ్దాల నాటి పాత చట్టాలు అందుకు అడ్డంకిగా మారాయని వ్యాఖ్యానించారు.

"పురోగతి దిశగా కొత్త ఏర్పాట్లు జరగాలంటే సంస్కరణలు తీసుకురావాల్సిందే. కానీ గత శతాబ్దానికి చెందిన చట్టాలతో కొత్త శతాబ్దాన్ని ఎలా నిర్మించగలం? పాత రోజుల్లో మంచిని ఆశించి చేసిన చట్టాలు ఇప్పుడు గుదిబండల్లా తయారయ్యాయి. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ" అని పేర్కొన్నారు. ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్టును వర్చువల్ విధానంలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Narendra Modi
Laws
New Century
Development
Reforms
Farmers
Protests

More Telugu News