Electronic Copying: కాకతీయ మెడికల్ కాలేజీలో సినీ ఫక్కీలో ఎలక్ట్రానిక్ మాస్ కాపీయింగ్!
- చెవిలో మైక్రోఫోన్ పెట్టుకున్న వైద్య విద్యార్థి
- కారులో కూర్చుని సమాధానాలు చెప్పిన డాక్టర్
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు
- మూడు పరీక్షలు ఈ విధంగా రాసినట్టు గుర్తింపు
- ఆలస్యంగా వెల్లడైన ఘటన
ఓ తెలుగు సినిమాలో ఓ విద్యార్థి చెవిలో మైక్రోఫోన్ అమర్చుకుని పరీక్షలు రాస్తుండగా, బయట ఓ వ్యాన్ లో కొందరు ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో సమాధానాలు చేరవేస్తుంటారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలోనూ అచ్చం అలాగే జరిగింది. ఓ వైద్య విద్యార్థి కాపీయింగ్ కు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతడు చెవిలో మైక్రోఫోన్ పెట్టుకోగా, బయట కారులో కూర్చున్న ఓ డాక్టర్ ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో సమాధానాలు అందించారు. ఈ ఎలక్ట్రానిక్ కాపీయింగ్ భాగోతాన్ని కాలేజీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు హైటెక్ విద్యార్థి నవంబరు 26, 28, డిసెంబరు 3వ తేదీల్లో జరిగిన పరీక్షల్లో ఈ విధంగా కాపీయింగ్ కు పాల్పడినట్టు వెల్లడైంది. అయితే ఈ ఉదంతం ఆలస్యంగా వెల్లడైంది.