Chandrababu: ఏలూరులో అసలేం జరుగుతోంది?... నిష్పాక్షికంగా విచారణ జరిపించాలి: చంద్రబాబు డిమాండ్

Chandrababu demands inquiry into Eluru incident
  • ఏలూరులో వింతజబ్బు
  • 250 మందికి పైగా బాధితులు అంటూ చంద్రబాబు స్పందన
  • వైసీపీ సర్కారు మొద్దనిద్ర పోతోందని వ్యాఖ్యలు
  • ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇదో ఉదాహరణ అంటూ విమర్శలు
  • సురక్షితమైన నీరు అందించలేకపోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏలూరులో ప్రజలు వింత జబ్బుతో బాధపడుతున్నారన్న దానిపైనే చర్చ జరుగుతోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. 250 మందికి పైగా బాధితులు ఉన్నారని, ఏలూరులో పరిస్థితి మరింత క్షీణిస్తోందని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని ఓవైపు వరదలు, తుపాను, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టిన సమయంలో వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు. ఇంతకంటే దారుణ వైఫల్యం ఇంకేముంటుంది? అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాల్సిన అవసరాన్ని ఏలూరులో నీరు కలుషితమైన ఘటన చాటుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఏలూరు ఘటన ఓ మచ్చుతునక మాత్రమేనని, రాష్ట్రంలో వైద్యసేవలు ఎంత దిగజారిపోయాయో ఇవాళ తేటతెల్లమైందని తెలిపారు. ప్రజల కనీస అవసరమైన సురక్షిత మంచినీరు అందించడంలో ఏ ప్రభుత్వం విఫలమైనా ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని మండిపడ్డారు.
Chandrababu
Eluru
Decease
YSRCP
Andhra Pradesh

More Telugu News