Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

622 new cases in telangana

  • 24 గంటల్లో 622 కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,73,341
  • కోలుకున్న 2,63,744 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,472

తెలంగాణలో గత 24 గంటల్లో 622 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 993  మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,73,341కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,63,744 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,472కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 8,125 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,116 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 104, రంగారెడ్డి జిల్లాలో 55 కరోనా కేసులు నమోదయ్యాయి.  
   

  • Loading...

More Telugu News