vaccine: భారత్‌లో వ్యాక్సిన్‌ను ఇలా పంపిణీ చేస్తారు.. వీడియో ఇదిగో

 air cargo are set to play a pivotal role in the distribution of vaccines

  • వ్యాక్సిన్ పంపిణీలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోది కీలక పాత్ర
  • ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఎయిర్ కార్గోది కూడా
  • ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టైమ్ అండ్ టెంపరేచర్ సెన్సిటివ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్’ అభివృద్ధి

అమెరికన్ కంపెనీ ఫైజర్, జర్మన్ ఫార్మా దిగ్గజం బయోఎన్‌టెక్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌తో పాటు పలు దేశాల వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ ‌లో ఆశాజనక ఫలితాలను ఇస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాక్సిన్లను అత్యంత శీతల వాతావరణంలో ఉండేలా అన్ని చర్యలు తీసుకుని తరలించాల్సి ఉంటుంది.

ప్రజలకు వాటిని అందించే ప్రక్రియలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పేద, మధ్య ఆదాయ దేశాల్లో అందుకు తగ్గ వసతుల లేమి ఆందోళనకరంగా మారింది. వ్యాక్సిన్‌ను భారత్‌లో కొన్ని వారాల్లోనే పంపిణీ చేసే అవకాశం ఉందని అఖిల పక్ష భేటీలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు వ్యాక్సిన్‌ సరఫరాకు సంబంధించిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

వ్యాక్సిన్ పంపిణీలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఎయిర్ కార్గో భారత్‌లో కీలక పాత్ర పోషించనున్నాయి. ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టైమ్ అండ్ టెంపరేచర్ సెన్సిటివ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్’ను అభివృద్ధి చేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ ను ఎలా సరఫరా చేయాలన్న విషయంపై ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను జీఎంఆర్ విడుదల చేసింది.  

  • Loading...

More Telugu News