saitej: తెరుచుకున్న థియేటర్లు.. హైదరాబాద్‌లో సినిమా చూసిన హీరో సాయితేజ్.. వీడియో ఇదిగో

saitej watches movie

  • కరోనా విజృంభణ వల్ల కొన్ని నెలలు మూతపడిన సినిమా థియేటర్లు
  • నేటి నుంచి తిరిగి తెరుచుకోవడంతో సినిమా చూసిన సాయితేజ్
  • ఐమ్యాక్స్ కు దర్శకుడు మారుతి కూడా

కరోనా విజృంభణ వల్ల మూతపడిన సినిమా థియేటర్లు నేటి నుంచి తెరుచుకోవడంతో హీరో సాయితేజ్ తన స్నేహితులతో కలిసి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కు వెళ్లి హాలీవుడ్ సినిమా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

హాలీవుడ్‌ సినిమా 'టెనెట్‌' ఈ రోజే విడుదల కావడంతో ఆ సినిమాను చూశాడు. ప్రతి ఒక్కరూ తిరిగి థియేటర్లకు రావాలని కోరాడు.  చాలాకాలం తర్వాత థియేటర్‌కు రావడం సంతోషంగా ఉందని, వెండితెరపై సినిమాని చూడడమే  అద్భుతమైన వినోదమని పేర్కొన్నాడు. తనలాగానే చాలామంది ఇలాగే భావిస్తారని చెప్పాడు. సినిమాని మళ్లీ సెలబ్రేట్‌ చేసుకుందామని, అయితే, థియేటర్‌కు వచ్చేముందు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని,  చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలని చెప్పాడు.

దర్శకుడు మారుతి కూడా ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కు వెళ్లి సినిమా చూశారు.  తాము సినిమాకు వచ్చామని, థియేటర్లకు రావడం చూస్తుంటే, మళ్లీ తాము తమ జీవితాల్లోకి వచ్చేసినట్లు అనిపిస్తుందని అన్నారు. ప్రేక్షకులందరూ సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయాలని కోరారు.

saitej
Tollywood
Hyderabad
  • Error fetching data: Network response was not ok

More Telugu News