Central Government: కేంద్రం కొత్త నిబంధన... జనవరి నుంచి పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ఆర్సీ స్వాధీనం!

Vehilce Without PUC Will Seased from January

  • పీయూసీ లేకుంటే మరింత కఠినం
  • తొలుత వారం గడువు ఇవ్వనున్న అధికారులు
  • ఆపై రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ స్వాధీనం

తమ వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తీసుకోని వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)ను స్వాధీనం చేసుకునేలా జనవరి నుంచి కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఈ మేరకు ముసాయిదాను తయారు చేసిన కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ వివిధ వర్గాల అభిప్రాయాలను కోరింది.

కాగా, ఈ నూతన వ్యవస్థలో భాగంగా అన్ని వాహనాల యజమానుల వివరాలను మోటార్ వాహనాల డేటాబేస్ కు అనుసంధానించిన సర్వర్లలో పొందుపరుస్తారు. ఏదైనా వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు పీయూసీ లేకుంటే, వారం రోజుల గడువు ఇస్తారు. వారంలోగా పొల్యూషన్ సర్టిఫికెట్ ను తీసుకోకుంటే, ఆర్సీని అధికారులు స్వాధీనం చేసుకుంటారు. వాహనాల ద్వారా విడుదలవుతున్న కాలుష్యం ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనను పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఇదే సమయంలో అన్ని రకాల వాహనాల పీయూసీ సర్టిఫికెట్ల జారీని కూడా మారుస్తూ, ఒకే రకమైన సర్టిఫికెట్ ను ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించింది. కొత్త సర్టిఫికెట్ లో క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే, వాహన యజమాని, వాహనం వివరాలు, అది విడుదల చేస్తున్న కాలుష్యం వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ఇక పీయూసీ తీసుకోవడానికి ముందే యజమాని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ కూడా వచ్చేలా నూతన వ్యవస్థ పనిచేయనుంది. ఈ విధానంలో వాహనాల దొంగతనాలను కూడా నివారించవచ్చని కేంద్రం భావిస్తోంది.

Central Government
RC
Pollution Certificate
  • Loading...

More Telugu News