Pope Francis: చైనాపై మండిపడ్డి పోప్ ఫ్రాన్సిస్
- ఉయిఘర్ ముస్లింలను చైనా అణచివేస్తోంది
- పాక్ లో యుజైదీలు కష్టాలను ఎదుర్కొంటున్నారు
- పలు ఇస్లామిక్ దేశాల్లో క్రైస్తవులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
డ్రాగన్ దేశం చైనాపై క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మండిపడ్డారు. ఆ దేశంలో ఉన్న ఉయిఘర్ ముస్లింలపై చైనా అరాచకాలకు పాల్పడుతోందని... వారిని అణచివేస్తోందని అన్నారు. 'లెట్ అజ్ డ్రీమ్ ది పాత్ టు ఫ్యూచర్' అనే పుస్తకాన్ని పోప్ ఫ్రాన్సిస్ రచించారు. ఇందులో రోహింగ్యాల గురించి, చైనాలో అణచివేతకు గురవుతున్న ఉయిఘర్ ముస్లింల గురించి, పాకిస్థాన్ లో అణచివేయబడుతున్న యుజైదీల గురించి ఫ్రాన్సిస్ ప్రస్తావించారు.
అణచివేతకు గురవుతూ, దుర్భర జీవితాన్ని గడుపుతున్న వీరి గురించి తాను అనునిత్యం ఆలోచిస్తుంటానని అన్నారు. ఇస్లామిక్ దేశాల్లో కష్టాలను ఎదుర్కొంటున్న క్రైస్తవుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులు రావాలని... అప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు.