Tata Tiago: మారుతి వేగన్ ఆర్ పై సెటైర్ వేసిన టాటా మోటార్స్!

Tata Motors Comments on Maruti Suzuki Wagon R

  • ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో 2 స్టార్స్ మాత్రమే
  • అత్యంత భద్రతైన కారు టాటా టియాగో
  • సోషల్ మీడియాలో టాటా మోటార్స్ పోస్ట్

తనకు పోటీలో ఉన్న వాహన సంస్థలపై ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న టాటా మోటార్స్, ఇప్పుడు మరోసారి అదే దారిని ఎంచుకుంది. తాజాగా తమకు ప్రధాన పోటీదారైన మారుతి సుజుకి మార్కెటింగ్ చేస్తున్న వేగన్ ఆర్ పై విరుచుకుపడింది. నేరుగా వేగన్ ఆర్ పేరును చెప్పకుండా, ఈ కారులో సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా తక్కువని, ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో కేవలం 2 స్టార్స్ మాత్రమే వచ్చాయని తెలిపింది. ఈ కారులో ప్రయాణించే వారికి సరైన భద్రత లేదని పేర్కొంది.

ఈ పోస్ట్ లో ఓ చెక్క బండికి ఉన్న చక్రం ఊడిపోయినట్టుగా క్రియేట్ చేసిన చిత్రాన్ని పోస్ట్ చేసిన టాటా మోటార్స్, "భద్రతను ఎంతమాత్రమూ మరచిపోకూడదన్నది చాలా ముఖ్యం. మీ కారు వైపు వెళ్లేటప్పుడు స్మార్ట్ గా ఉండండి. టియాగోను ఎంచుకోండి. ఈ సెగ్మెంట్ లో అత్యంత భద్రతతో ఉన్న కారు ఇదే. జీఎన్సీఏపీ నుంచి 4 స్టార్ రేటింగ్ ఉంది" అని పేర్కొంది.ఇక ఈ పోస్ట్ లో వాగన్ ఆర్ పేరును వెల్లడించక పోయినా ఈ పోస్ట్ వైరల్ అయింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News