GHMC Elections: దుబ్బాక విజయం స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం: బాబూ మోహన్‌

bjp will win in ghmc

  • తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న బాబు మోహన్ 
  • అనంతరం మీడియాతో మాట్లాడిన నేత
  • దుబ్బాకలో బీజేపీ గెలవడం అంటే కేసీఆర్‌ని ఓడించినట్టే
  • బీజేపీలోకి నాయకుల చేరికలు పెరిగాయి

ప్రస్తుతం తెలంగాణ రాజకీయ నాయకుల దృష్టి అంతా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనే ఉంది. 2016 ఎన్నికల్లోనూ జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ తర్వాత అధికంగా ఓట్లు సాధించిన రికార్డు ఉన్న బీజేపీ ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలోనూ విజయం సాధించడంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తాము గెలుస్తామని బీజేపీ నేత బాబూ మోహన్ అన్నారు.

ఈ రోజు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల దక్కిన దుబ్బాక విజయం స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పారు. దుబ్బాకలో బీజేపీ గెలవడం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఓడించినట్టేనని తెలిపారు. బీజేపీలోకి నాయకుల చేరికలు పెరిగాయని చెప్పారు. ఇరు తెలుగు‌ రాష్ట్రాల్లోనూ తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.

GHMC Elections
dubbaka
babu mohan
  • Loading...

More Telugu News