Prakash Javadekar: కేసీఆర్ కుటుంబం, సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయి: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

prakash javadekar slam trs

  • జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో విమర్శలు 
  • హైదరాబాద్‌లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి
  • వర్షాలకు 15 రోజులు హైదరాబాదీలు ఇళ్లలోనే ఉండిపోయారు
  • ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ కుటుంబం, సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షాలకు 15 రోజులు హైదరాబాదీలు ఇళ్లలోనే ఉండిపోయారని తెలిపారు.

ఆరేళ్లలో 60 వైఫల్యాలంటూ బీజేపీ చార్జిషిషీటు విడుదల చేసింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పింది. హైదరాబాద్ లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జవదేకర్.. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగట్లేదని చెప్పారు. కనీసం డ్రైనేజీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని తెలిపారు.

టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ ను విశ్వనగరంగా చెప్పారని, కానీ, దీన్ని ప్లడ్ సిటీనగరంగా  మార్చారని ఆయన అన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని టీఆర్ఎస్ చెప్పిన మాటలు మూటలయ్యాయని ఆయన విమర్శలు గుప్పించారు. లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కడతామని చెప్పారని అయితే, వెయ్యి కూడా కట్టలేదని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు రెండున్నర కోట్ల ఇళ్లను కట్టి చూపించిందని చెప్పారు.

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని తెలిపారు. హైదరాబాద్ మేయర్‌గా ఎంఐఎం అభ్యర్థి కావాలా? లేక బీజేపీ అభ్యర్థి కావాలా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీజేపీ కృషి ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కోసం బీజేపీ పోరాడింది ఇటువంటి పాలన కోసం కాదని ఆయన చెప్పారు.

Prakash Javadekar
BJP
TRS
GHMC Elections
  • Loading...

More Telugu News