River Tungabhadra: నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు.. మధ్యాహ్నం నదిలో ప్రవేశించనున్న పుష్కరుడు

  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
  • నదీ పరీవాహక ప్రాంతంలో 23 ఘాట్ల నిర్మాణం
  • నీటి సమస్య లేకుండా అదనంగా రోజుకు 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల

చుట్టూ కరోనా కమ్ముకున్న వేళ నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు బృహస్పతి మకరరాశిలోకి  ప్రవేశించాక పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభిస్తారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఐదువేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనుంది. అలాగే, ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.

తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం 23 ఘాట్లను నిర్మించింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులను స్నానాలకు అనుమతించనున్నారు. నీటి సమస్య లేకుండా ఉండేందుకు తుంగభద్ర డ్యాం నుంచి అదనంగా రోజుకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. కాగా, 2008లో వచ్చిన తుంగభద్ర పుష్కరాల్లో 50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

  • Loading...

More Telugu News