Sushant Singh Rajput: బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. విచారణకు హాజరైన నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు

Actor Arjun Rampals Girlfriend Questioned NCB
  • సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి
  • ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారించిన అధికారులు
  • నేడు విచారణకు హాజరు కానున్న అర్జున్ రాంపాల్
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా దెమిత్రియాడెన్‌ను నిన్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు విచారించారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారించారు. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.

గత సోమవారం అర్జున్ రాంపాల్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణకు రావాలంటూ రాంపాల్‌తోపాటు ఆయన ప్రేయసి గాబ్రియెల్లాకు సమన్లు జారీ చేశారు. అందులో భాగంగా నిన్న మధ్యాహ్నం ఆమె ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకోగా, అధికారులు ఆమెను విచారించారు. నేడు అర్జున్ రాంపాల్ విచారణకు హాజరు కానున్నాడు.
Sushant Singh Rajput
Drugs Case
Arjun Rampal
Gabriella Demetriades
NCB

More Telugu News