Raviteja: 'క్రాక్'తో సంక్రాంతి బరిలో దిగుతున్న రవితేజ!

Raviteja film Krack to be released for Pongal

  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్'
  • రవితేజ సరసన నాయికగా శ్రుతిహాసన్
  • కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్
  • ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్     

సాధారణంగా సంక్రాంతి పండుగ తెలుగు వారికే కాకుండా, టాలీవుడ్ కి కూడా ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే, సంక్రాంతికి మంచి ఓపెనింగ్స్ ఉంటాయన్న ఉద్దేశంతో మన పెద్ద హీరోలంతా తమ సినిమాలను అప్పుడు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది. అందుకే, టాలీవుడ్ కి కూడా సంక్రాంతి అన్నది పెద్ద పండుగ అయిపోయింది!

ఇక విషయానికి వస్తే, లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ థియేటర్లు మూతబడడం.. ఇప్పుడు నిబంధనల మేరకు అనుమతినిచ్చినా ఎవరూ తమ సినిమాలను రిలీజ్ చేయకపోవడం మనం చూస్తున్నాం. అందుకే, చాలామంది నిర్మాతలు నిర్మాణంలో వున్న తమ సినిమాల విడుదలను వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని సినిమాల ప్రకటనలు కూడా వచ్చాయి.

ఈ క్రమంలో సంక్రాంతి బరిలో హీరో రవితేజ కూడా దిగుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కథానాయకుడుగా రూపొందుతున్న 'క్రాక్' చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నిర్మాతలు ప్రకటించారు. చిత్రం షూటింగుకు సంబంధించి ఒక పాట చిత్రీకరణ మినహా అంతా పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయనీ పేర్కొన్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్షీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.

Raviteja
Gopichand Malineni
Shruti Hassan
Varalakshmi
  • Loading...

More Telugu News