Prabhas: ప్రభాస్ యాక్షన్ సీన్ కి అంత ఖర్చా?

Huge sets erected for Radhe Shyam movie shoot
  • ఇటలీలో భారీ షెడ్యూల్ చేసిన 'రాధే శ్యామ్'
  • త్వరలో హైదరాబాదులో మరో షెడ్యూలు
  • క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
  • 30 కోట్ల వ్యయంతో సెట్స్ నిర్మాణం  
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతని సినిమాలంటే తెలుగులోనే కాకుండా బాలీవుడ్ వ్యాపార వర్గాలలో కూడా విపరీతమైన క్రేజ్. అందుకే, ఆయన నటించే సినిమాలన్నీ ఇక జాతీయ స్థాయిని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు. దీంతో ఆటోమేటిక్ గా బడ్జెట్టు పెరిగిపోతుంది. ఇప్పుడు ఆయన నటిస్తున్న 'రాధే శ్యామ్' విషయంలోనూ అదే జరుగుతోంది.

'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల ఇటలీలో జరిగిన సంగతి విదితమే. అక్కడ కీలక సన్నివేశాలతో పాటు పాటలు కూడా చిత్రీకరించినట్టు వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు హైదరాబాదులో మిగతా షూటింగును ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో క్లైమాక్స్ కి చెందిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. హాలీవుడ్ సినిమా 'గ్లాడియేటర్'కి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఆస్కార్ విజేత నిక్ పావెల్ ఈ 'రాధే శ్యామ్'కి పనిచేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చిత్రీకరించే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాదులో భారీ సెట్స్ వేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 30 కోట్లు ఖర్చుపెడుతున్నారట. మరి, ఈ స్థాయిలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రం రేపు వెండితెరపై ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
Prabhas
Pooja Hegde
Radhakrishna
Radhe Shyam

More Telugu News