Rohit Sharma: రోహిత్ విజృంభణ... విజయం దిశగా ముంబయి ఇండియన్స్

Rohit fifty in IPL final

  • ఢిల్లీ క్యాపిటల్స్ తో ఐపీఎల్ ఫైనల్లో ముంబయి ఆధిపత్యం
  • ముంబయి టార్గెట్ 157 రన్స్
  • 14 ఓవర్లలో 2 వికెట్లకు 116 పరుగులు చేసిన ముంబయి

కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి నడిపిస్తుండంతో లక్ష్యఛేదనలో ముంబయి దూసుకుపోతోంది. ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విసిరిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి జట్టు 14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 64, ఇషాన్ కిషన్ 9 పరుగులతో  క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఓపెనర్ క్వింటన్ డికాక్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (19) దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. లేని పరుగు కోసం రోహిత్ శర్మ ముందుకు రాగా, తన కెప్టెన్ కోసం సూర్యకుమార్ తన వికెట్ త్యాగం చేశాడు. ఢిల్లీ బౌలర్లలో రబాడా, అశ్విన్ సహా అందరూ తేలిపోయారు.

Rohit Sharma
Fifty
IPL 2020
Final
Delhi Capitals
  • Loading...

More Telugu News