Nara Lokesh: 'సీఎం సొంత జిల్లాలో వైసీపీ నేతలు ముస్లిం మహిళను వేధిస్తున్న తీరు ఇది..' అంటూ వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్

Nara Lokesh once again hits out YSRCP leaders

  • వైసీపీ నేతలపై ధ్వజమెత్తిన లోకేశ్
  • రాక్షసరాజ్యం సాగుతోందని వ్యాఖ్యలు
  • ఒంటరి ముస్లిం మహిళను రోడ్డున పడేశారంటూ ఆగ్రహం

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ వైసీపీ నేతలపై మరోసారి ధ్వజమెత్తారు. సీఎం సొంత జిల్లాలోనే వైసీపీ నేతలు ముస్లిం మహిళను వేధిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో రాక్షస రాజ్యం సాగుతోందని స్పష్టమవుతుందని మండిపడ్డారు. రాయచోటిలో అంగన్ వాడీ వర్కర్ ను తీసేసి తమవాళ్లను నియమించుకునేందుకు వైసీపీ రౌడీలు ఏకంగా అంగన్ వాడీ స్కూల్ నే కాల్చేశారని వెల్లడించారు.

అంగన్ వాడీ ఉద్యోగమే ఆధారంగా బతుకుతున్న భర్తలేని నలుగురు పిల్లలున్న ముస్లిం మహిళను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఆమెపైనే తప్పుడు కేసులు పెట్టారని లోకేశ్ ఆరోపించారు. నలుగురు పిల్లలతో ఒంటరి ముస్లిం మహిళను రోడ్డునపడేయడమేనా జగన్ మహిళలకు ఇచ్చే భరోసా? అని నిలదీశారు.

Nara Lokesh
YSRCP
Muslim Woman
Anganwadi
Jagan
Andhra Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News