KCR: ర్యాడ మ‌హేశ్ కుటుంబానికి రూ.50 ల‌క్ష‌లు.. ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన సీఎం కేసీఆర్

kcr announce 50 lakhs to ryada mahesh family

  • ఉగ్రవాదులపై పోరాడుతూ అమరుడైన మహేశ్
  • సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
  • ఆ కుటుంబానికి ఇంటి స్థలం

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రవాదులపై పోరాడుతూ జరిపిన ఎదురుకాల్పుల్లో నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ ర్యాడ మహేశ్‌(26) వీర మరణం పొందిన విషయం తెలిసిందే.  ర్యాడ మహేశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, అలాగే, ఆ కుటుంబానికి ఇంటి స్థలం కేటాయిస్తామని కేసీఆర్ ప్రటకన చేశారు.  

కాగా,  ఉగ్రవాదులపై పోరాడుతూ జరిపిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కూడా ఏపీ సీఎం జగన్ రూ.50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన లేఖ రాశారు.

KCR
TRS
Telangana
ryada mahesh
  • Loading...

More Telugu News