Exit Polls: ఆర్జేడీ దూకుడు... 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం!

RJD Mejority in Bihar Elections in First Trends
  • ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం తలకిందులు
  • భారీ మెజారిటీ దిశగా ఆర్జేడీ
  • ఆధిక్యంలో సీఎం అభ్యర్థి తేజస్వి
బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం తలకిందులయ్యేలా ఉన్నాయి. ఎన్డీయే, మహా ఘటబంధన్ మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీ సాగిందని, మెజారిటీకి అవసరమైన సీట్లకన్నా కనీసం 10 నుంచి 15 అధిక సీట్లను ఆర్జేడీ నేతృత్వంలోని కూటమి సాధిస్తుందని పలు సంస్థలు అంచనాలు వేయగా, ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ను గమనిస్తే, ఆర్జేడీ ఘన విజయం దిశగా సాగుతోందనిపిస్తోంది.

మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ లో 185 స్థానాల తొలి దశ కౌంటింగ్ పూర్తి కాగా, ఎన్డీయే 74 స్థానాల్లో, మహా ఘటబంధన్ 109 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. ఎల్జేపీ ఒక్క స్థానంలో, ఇతరులు మరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అభ్యర్థి తేజస్వితో పాటు ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్, పలువురు మహా ఘటబంధన్ నేతలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Exit Polls
Bihar
RJD

More Telugu News