Ramcharan: ప్రభాస్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన రామ్ చరణ్!

ramcharan plants siplings

  • జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన చెర్రీ
  • టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు  సంతోష్ కుమార్ తో కలిసి వీడియో
  • ఆలియా భ‌ట్, రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి చాలెంజ్

సినీనటుడు రామ్ చరణ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఇటీవల ప్రభాస్ కూడా ఇందులో పాల్గొని చెర్రీకి చాలెంజ్ విసరడంతో ఆయన ఈ ఛాలెంజ్ ను స్వీకరించాడు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు  సంతోష్ కుమార్ తో కలిసి చెర్రీ మొక్కలు నాటాడు.

ప్రభాస్ తనకు మొక్కలు నాటే అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందని చెర్రీ అన్నాడు. మొక్కలు నాటడం అనేది మనందరి ప్రాథమిక కర్తవ్యమని, ప్రకృతి సమతుల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద జీవించగలుగుతామని ఆయన అన్నాడు. ఈ చాలెంజ్ ప్రారంభించిన సంతోష్‌ను అభినందిస్తున్నానని చెప్పాడు.

తాను తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆలియా భ‌ట్, దర్శకుడు రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా బృందం సభ్యులు అందరూ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆయన సవాలు విసిరారు.

Ramcharan
Tollywood
Green India Challenge
  • Error fetching data: Network response was not ok

More Telugu News