Yediyurappa: బాణసంచా కాల్చడంపై వెనక్కి తగ్గిన యడ్డీ సర్కార్

Yediyurappa takes U turn on burning crackers
  • దీపావళికి బాణసంచాను కాల్చడంపై పలు రాష్ట్రాల నిషేధం
  • తొలుత నిషేధం విధించి.. తర్వాత వెనక్కి తగ్గిన యడ్డీ ప్రభుత్వం
  • వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చన్న యడ్డీ
కరోనా నేపథ్యంలో ఎవరూ కూడా దీపావళికి బాణసంచా కాల్చకూడదంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేశాయి. కర్ణాటకలోని యడియూరప్ప ప్రభుత్వం కూడా బాణసంచాపై నిషేధం విధించింది. అయితే యడియూరప్ప కొంత వెనక్కి తగ్గారు.

బాణసంచాను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుందని... అందువల్ల వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవాలని యడియూరప్ప సూచించారు. గ్రీన్ కాకర్స్ కాల్చడంపై అభ్యంతరం లేదని చెప్పారు. బాణసంచా తయారు చేసే కంపెనీలు కూడా పర్యావరణానికి హాని తలపెట్టని వాటినే తయారు చేయాలని, వాటినే అమ్మాలని కోరారు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళిని జరుపుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం అన్ని రకాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
Yediyurappa
Karnataka
BJP
Crackers

More Telugu News