Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Kajal praises his hubby

  • భర్తను తెగ పొగిడేస్తున్న కాజల్!
  • ఓటీటీ కోసం సీనియర్ వంశీ కథలు
  • నిరాశపరిచిన నితిన్ సినిమా టీఆర్పీ    

*  తన భర్త గౌతమ్ చాలా మంచి అబ్బాయి అంటోంది అందాలతార కాజల్ అగర్వాల్. ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ ను పెళ్లాడిన కాజల్ అతని గురించి చెబుతూ, 'మంచి మనసున్న వాడు. అందర్నీ గౌరవిస్తాడు. అందర్నీ అర్థం చేసుకుంటాడు. అటువంటి వ్యక్తి భర్తగా దొరకడం నా అదృష్టం' అని చెప్పింది కాజల్.
*  కొత్త ఒరవడితో సినిమాలు రూపొందించి తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న ప్రముఖ దర్శకుడు వంశీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ కి వస్తున్నారు. తాను రాసిన కొన్ని చిన్న కథలను వెబ్ డ్రామాలుగా రూపొందించనున్నారట. వీటికి తానే యాంకరింగ్ కూడా చేస్తారని తెలుస్తోంది.
*  నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'భీష్మ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఈ చిత్రాన్ని జెమినీ టీవీ ప్రసారం చేయగా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదని తెలుస్తోంది. కేవలం 6.65 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుందని సమాచారం.

Kajal Agarwal
Vamshi
Nithin
Rashmika Mandanna
  • Loading...

More Telugu News