AP NGO: కరోనాతో ప్రాణాలు పోతున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలి: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు

  • హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం 30 శాతం హెచ్ఆర్ ఇచ్చింది
  • విశాఖకు వచ్చే ఉద్యోగులకు కూడా 30 శాతం హెచ్ఆర్ ఇవ్వాలి
  • ఎన్నికలను నిర్వహించాలనుకుంటే కోర్టుకు వెళతాం 

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ అవతరిస్తుందని ఆయన అన్నారు. ఉద్యోగులు కూడా విశాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగులు వచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం హెచ్ఆర్ ఇచ్చిందని... ఇప్పుడు విశాఖకు వచ్చే ఉద్యోగులకు కూడా 30 శాతం హెచ్ఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కరోనా కారణంగా ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే ఇచ్చారని... కట్ చేసిన జీతాలను వెంటనే చెల్లించాలని అన్నారు. మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టు 5 రోజుల అదనపు సెలవులు ఇవ్వాలని కోరారు. కరోనా కారణంగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని... ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలని అన్నారు. కరోనా తగ్గకుండానే ఎన్నికలను నిర్వహించాలనుకుంటే కోర్టుకు వెళ్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News