KXIP: చెన్నై టార్గెట్ 154 రన్స్... ఈసారి ధోనీ సేన ఏంచేస్తుందో..?
- అబుదాబిలో పంజాబ్ వర్సెస్ చెన్నై
- మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 రన్స్
- రాణించిన దీపక్ హుడా
అబుదాబిలో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో రవీంద్ర జడేజా వీరవిహారంతో సూపర్ చేజింగ్ చేసిన చెన్నై జట్టు ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఛేజింగ్ పై నమ్మకంతోనే ధోనీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాచ్ విషయానికొస్తే... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టాపార్డర్ ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 29, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 26, క్రిస్ గేల్ 12, నికొలాస్ పూరన్ 2 పరుగులు మాత్రమే చేశారు.
చివర్లో దీపక్ హుడా ధాటిగా ఆడడంతో పంజాబ్ జట్టుకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. దీపక్ హుడా 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు సాధించాడు. చెన్నై బౌలర్లలో లుంగీ ఎంగిడి 3 వికెట్లు తీసి పంజాబ్ ను సమర్థంగా కట్టడి చేశాడు. శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, జడేజా తలో వికెట్ తీశారు.