Nagarjuna: బిగ్ బాస్ కోసం ఓ హెలికాప్టర్, మరో ప్రైవేట్ జెట్...నాగార్జున స్పెషల్ వీడియో ఇది!

Nagarjuna Special Video

  • గత వారంలో హోస్ట్ గా పనిచేసిన సమంత
  • "బిగ్ బాస్ కోసం కింగ్ ఈజ్ బ్యాక్" అంటున్న వీడియో
  • తాను చేయలేనన్న సమంత

గత వారం బిగ్ బాస్ సీజన్ 4ను వారాంతంలో హోస్ట్ చేసే బాధ్యతను తన కోడలి చేతిలో పెట్టిన కింగ్ నాగార్జున, ఈ వారం తిరిగి వచ్చారు. 21 రోజుల పాటు షూటింగ్ లో ఉండాల్సి వుందని, ఆ తరువాతే షోలో కనిపిస్తానని నాగ్ చెప్పడంతో మరో రెండు వారాలు సమంత వ్యాఖ్యాతగానే షో జరుగుతుందని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా నాగార్జున ఈ శనివారం ప్రత్యక్షమై, వీకెండ్ షోను హోస్ట్ చేశారు.

ఇక ఈ షో కోసం తొలుత హెలికాప్టర్ లో, ఆపై ప్రైవేటు జెట్ లో నాగ్ ప్రయాణం చేసి, హైదరాబాద్ చేరుకున్న వీడియోను స్టార్ మా విడుదల చేసింది. "బిగ్ బాస్ కోసం కింగ్ ఈజ్ బ్యాక్" అంటూ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఇదిలావుండగా, తాను ఈ షోను చేయలేనని సమంత స్పష్టం చేయడంతోనే, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నాగార్జున రావాల్సి వచ్చిందని సమాచారం. గత వారం ఈ షోను సమంత చాలా చక్కగా నిర్వహించిందనే చెప్పాలి. తన ముద్దుముద్దు మాటలతో, నవ్వుతో షోను రక్తికట్టించిన సమంత, మూడు గంటల షో షూటింగ్ కు దాదాపు 10 నుంచి 12 గంటల సమయం తీసుకుందట. ఆపై దీన్ని హోస్ట్ చేయడం తన వల్ల కాదని ఆమె చేతులెత్తేయడంతోనే, నాగ్ వచ్చారని టాలీవుడ్ టాక్. ఇక షూటింగ్ నిమిత్తం హిమాలయాల్లో ఉన్న నాగ్, తొలుత చాపర్ లో, ఆపై ప్రైవేట్ జెట్ లో బయలుదేరి వస్తున్న వీడియోలను మీరూ చూడవచ్చు.



Nagarjuna
Helecopter
Video
Jet
Private Jet
  • Error fetching data: Network response was not ok

More Telugu News