Devineni Uma: ఎందుకు మాట్లాడడం లేదంటున్న రైతులకు సమాధానం చెప్పండి: దేవినేని ఉమ
- దేశంలో 15 జాతీయ ప్రాజెక్టుల నత్తనడక
- 1984లో ప్రారంభమైన మహారాష్ట్ర "గోసిఖుర్డ్"
- అది ఎప్పుడు పూర్తవుతుంది?
- 17 నెలల్లో పోలవరం పనులు మీరు ఎంత చేశారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘దేశంలో 15 జాతీయప్రాజెక్టుల నత్తనడక.. 1984లో ప్రారంభమైన మహారాష్ట్ర "గోసిఖుర్డ్" ఎప్పుడు పూర్తవుతుంది? ఇతర రాష్ట్రాల్లో దీనంగా వాటి పరిస్థితి. పోలవరాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు 70 శాతానికి పైగా పూర్తిచేశారు. 17 నెలల్లో మీరు ఎంత పనిచేశారు? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదంటున్న రైతులకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని ఆయన నిలదీశారు.
ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని దేవినేని ఉమ పోస్టు చేశారు. ఇతర రాష్ట్రాల్లో జాతీయ హోదా ప్రాజెక్టుల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, అందుకే, వాటిని చూసే పోలవరంపై గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, నిర్మాణ బాధ్యతలు చేపట్టిందని అందులో పేర్కొన్నారు. నిధులిస్తే 2022 ఏప్రిల్‌కు పూర్తయ్యే చాన్సు ఉందని అందులో తెలిపారు.