: ఆ పావురం రేటు 2.2 కోట్లు!


మీరు ఒక పావురాన్ని కొనాలనుకుంటే ఏ వందో... వెయ్యో పెట్టి కొంటారు. అయితే బ్రిటన్‌లో ఒక పావురం మాత్రం 2.2 కోట్ల ధర పలికింది. ఆ పావురం అంత ప్రత్యేకమైందా...? అంటే అంతే ప్రత్యేకమైంది. ఎంతగా అంటే వేగంగా ఎగరడంలో దాన్ని మించిన పావురం లేదట...! అందుకే పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ పేరును దానికి పెట్టారు.

లండన్‌లోని పీజియన్‌ పారడైజ్‌లో ఇలాంటి ప్రముఖమైన పావురాలను వేలం వేశారు. ఈ వేలంలో ఉసేన్‌ బోల్ట్‌ అనే పేరున్న ఈ పావురం అత్యధిక ధరకు అమ్ముడుబోయింది. చైనాకు చెందిన ఒక వ్యాపారవేత్త దీన్ని కొనుగోలు చేశారు. మెరుపువేగంగా ఎగరడం దీని ప్రత్యేకతట. బోల్ట్‌తోబాటు మరో తొమ్మిది పావురాలను కూడా వేలం వేశారు. వీటిని చైనా, తైవాన్‌ దేశాలకు చెందిన వారు కొనుగోలు చేశారు. ఈ పది పావురాలు మొత్తం 56 లక్షల డాలర్లకు అమ్ముడయ్యాయని వేలం పాట నిర్వహకులు తెలిపారు. అయితే గతంలో ఒక పావురాన్ని 3.2 లక్షల డాలర్లకు చైనా వ్యాపారవేత్త కొనుగోలు చేశాడట.

  • Loading...

More Telugu News