IPL 2020: చెన్నై జట్టు ఓటమిపై ధోనీ భార్య భావోద్వేగం

Sakshi Dhonis response on CSKs performance

  • ఐపీఎల్ చెన్నై జట్టు చెత్త ప్రదర్శన
  • పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానం
  • ఐపీఎల్ ను ఒక ఆటగానే చూడాలన్న సాక్షి

ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శన చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలబడి ప్లేఆఫ్ కు వెళ్లకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. గత ఏ సీజన్లో కూడా సీఎస్కీ ఇంత దారుణమైన ప్రదర్శన చేయలేదు.

నిన్న జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని చెన్నై ఓడించినప్పటికీ... ఆ గెలుపుని అభిమానులు ఆస్వాదించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ధోనీపై కూడా అభిమానులు మండిపడుతున్నారు. ధోనీ పని అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్టును షేర్ చేశారు.

ఐపీఎల్ అనేది కేవలం ఒక ఆట మాత్రమేనని... కొన్ని మ్యాచ్ లలో గెలుస్తారని, కొన్నింటిలో ఓడిపోతారని సాక్షి తెలిపారు. గెలిచినప్పుడు సంతోషించడం, ఓడినప్పుడు వేదనకు గురవడం జరుగుతుంటుందని అన్నారు. అయితే క్రికెట్ ను కేవలం ఆట మాదిరిగానే చూడాలని... మన భావోద్వేగాలను క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేందుకు వాడకూడదని చెప్పారు.

ఓడిపోవాలని ఎవరూ కోరుకోరని... ఇదే సమయంలో అందరూ విజేతలు కాలేరని అన్నారు. నిజమైన యోధులు యుద్ధం చేయడానికే పుడతారని సాక్షి చెప్పారు. అభిమానుల గుండెల్లో వారు ఎప్పటికీ సూపర్ కింగ్స్ గానే ఉంటారని అన్నారు.

IPL 2020
MS Dhoni
Sakshi Dhoni
CSK
  • Loading...

More Telugu News