Hetero Drugs: హైదరాబాద్ వరద సహాయచర్యల కోసం రూ.10 కోట్ల భారీ విరాళం ప్రకటించిన హెటెరో సంస్థ
- వరదలతో హైదరాబాద్ అస్తవ్యస్తం
- ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతలు
- ఉదారంగా స్పందించిన హెటెరో యాజమాన్యం
భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని పునరుద్ధరించే దిశగా భారీ విరాళాలు అందుతున్నాయి. వరదలతో కుదేలైన నగరజీవులను ఆదుకునేందుకు దాతలు విరివిగా స్పందిస్తున్నారు. తాజాగా, ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో డ్రగ్స్ భారీ విరాళం ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర సర్కారు చేపడుతున్న సహాయ చర్యల కోసం తమ వంతుగా హెటెరో యాజమాన్యం రూ.10 కోట్ల విరాళం అందించాలని నిర్ణయించింది. వరదల వల్ల ఎక్కువగా నష్టపోయిన పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందించి ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని హెటెరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి రెడ్డి వెల్లడించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కు హీరో రామ్ రూ.25 లక్షలు విరాళం
హైదరాబాద్, తెలంగాణలోని పలు ఇతర జిల్లాల్లో వరద బీభత్సం టాలీవుడ్ ప్రముఖులను కదిలించింది. ఇప్పటికే అగ్రతారలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు అందించారు. తాజాగా యువ నటుడు రామ్ పోతినేని కూడా స్పందించారు. తనవంతుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు చెక్ ను మంత్రి కేటీఆర్ కు అందించారు. కేటీఆర్ కార్యాలయానికి వెళ్లిన హీరో రామ్ వరద పరిస్థితులపై మాట్లాడారు.