Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. 22 మంది ఆర్జేడీ అభ్యర్థులపై తీవ్ర నేరారోపణలు

22 RJD Candidates facing criminal cases

  • ఈ నెల 28న తొలి విడత ఎన్నికల పోలింగ్
  • అభ్యర్థుల నేర చరిత్రను సోషల్ మీడియాలో పెట్టిన ఆర్జేడీ
  • అనంత్‌సింగ్‌పై 38 కేసులు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈ నెల 28న ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో మునిగితేలుతున్నాయి.

ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 22 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. వీరిందరిపైనా హత్య, దోపిడీ వంటి కేసులు నమోదై ఉన్నాయి. ముఖ్యంగా మోకామా నుంచి బరిలోకి దిగిన అనంత్ సింగ్‌పై ఏకంగా 38 కేసులు ఉన్నాయి. వీటిలో హత్య సహా పలు తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఓ హత్యకేసు పెండింగ్‌లో ఉంది.  అయినప్పటికీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడం గమనార్హం.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సామాజిక మాధ్యమం, ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో తమ అభ్యర్థుల నేర చరిత్రను ఆర్జేడీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

  • Loading...

More Telugu News