gangavva: గంగవ్వ చాలా సేఫ్ గా ఉంది.. మనం ఎవరం భయపడాల్సిన పనిలేదు: మై విలేజ్ షో టీమ్

gangavva safe

  • బిగ్ బాస్ నుంచి బయటకు గంగవ్వ
  • అనారోగ్యం కార‌ణంగా నిర్ణయం
  • గంగవ్వకు ఇల్లు కట్టిస్తానన్న నాగార్జున
  • గంగవ్వ ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన

బిగ్ బాస్ లో దూసుకుపోతోన్న గంగ‌వ్వ అనారోగ్యం కార‌ణంగా ఆ కార్యక్రమం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. వారం రోజులుగా గంగవ్వ ఆరోగ్యం సరిగా లేదని వ్యాఖ్యాత నాగార్జున తెలిపారు. ఆమె మెడికల్ రిపోర్ట్ ను కూడా చూపించారు. ఆమెకు హౌస్ సభ్యులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... ‘నువ్వు ఏదైతే ఆశించి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చావో ఆ కోరిక తీర్చుతా’ అని చెప్పారు.

ఆమె ఇల్లు కావాలని అందని, తాను ఆమెకు ఇల్లు కట్టిస్తానని చెప్పారు. హ్యాపీగా ఇంటికి వెళ్లాలని అన్నారు. దీంతో హర్షం వ్య‌క్తం చేసిన గంగ‌వ్వ.. హౌస్ లో త‌న‌కు ఇష్ట‌మైన అఖిల్‌ని సేవ్ చేసి వెళ్లింది. అయితే, గంగవ్వ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసే మై విలేజ్ షో చేసిన ఓ ట్వీట్ ను గంగవ్వ రీట్వీట్ చేసింది. ‘గంగవ్వ చాలా సేఫ్ గా ఉంది.  మనం ఎవరం భయపడాల్సిన పనిలేదు. డాక్టర్ సలహా మేరకు ఒక వారం స్పెషల్ కేర్ లో ఉంచడం జరిగింది. దయచేసి మనందరం సహకరిద్దాం’ అని అందులో పేర్కొన్నారు.

gangavva
Bigg Boss
Nagarjuna
  • Error fetching data: Network response was not ok

More Telugu News